NLR: సంగం పట్టణంలో మూడో శనివారం ‘స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం ప్రతిజ్ఞ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త విడివిడిగా పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాలెట్, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, తదితరులు పాల్గొన్నారు.