MBNR: హన్వాడ మండల ఎంపీడీవో కార్యాలయానికి అవసరమైన కంప్యూటర్ను ఎంపీడీవో యశోద అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతిక సదుపాయాలు పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు లభిస్తాయన్నారు. ఉద్యోగులు కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.