MDK: మనోహరాబాద్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా శివగోని పెంట గౌడ్ (లింగారెడ్డిపేట) ఎన్నికయ్యారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి సమక్షంలో కమిటీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యక్షులుగా భాస్కర్ యాదవ్ (మనోహరాబాద్), ప్రధాన కార్యదర్శిగా పుట్ట వినోద మహేందర్ ఎన్నికయ్యారు. ఇందులో మండల సర్పంచులు పాల్గొన్నారు.