MDK: రామాయంపేట మండలం జాన్సీ లింగాపూర్ గ్రామంలో ఇచ్చిన మాటకు కట్టుబాటుగా ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో మానెగల రామకృష్ణయ్యసర్పంచ్గా గెలిస్తే తాను భిక్షాటన చేస్తానని ఆయన కుమారుడు గ్రామానికి హామీ ఇచ్చాడు. తండ్రి విజయం సాధించడంతో ఆ మాటను నిలబెట్టుకునేందుకు మూడో కుమారుడు భాస్కర్ నేడు గ్రామంలో భిక్షాటన చేశాడు.