AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ స్పందించారు. పవన్‌పై రాజకీయంగా కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశానని తెలిపారు. కానీ ఆయన ఫ్యామిలీని తానెప్పుడు తిట్టలేదని చెప్పారు. తన ఫ్యామిలీని కూడా టీడీపీ, జనసేన కార్యకర్తలు బూతులు తిట్టారని ఆరోపించారు.