WGL: హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసంలో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA మున్సిపల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయమని CMను కోరారు. దీంతో CM, NSPT మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రత్యేక నిధుల నుంచి రూ.30 కోట్లు మంజూరు చేశారని MLA దొంతి వెల్లడించారు.