కోనసీమ: పీ.గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి సహకరించాలని గ్రామస్తులు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వీ.సత్యనారాయణను కోరారు. ఈ మేరకు వారు అమలాపురంలోని దేవాదాయ శాఖ కార్యాలయం వద్ద దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌ను కలిసి ఆలయ నిర్మాణం ఆవశ్యకతను వివరించారు