PDPL: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రామ్ జీ పేరుతో తీసుకొచ్చిన బిల్లు ప్రతులను ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో సీపీఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఏక పక్షంగా ఆమోదించుకుందని నాయకులు ఆరోపించారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు.