కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమ వసూళ్ల పర్వం కలకలం రేపుతోంది. SEP నెలలో దేహదారుడ్య పరీక్షల కోసం వచ్చిన సుమారు 200 మంది ట్రైనింగ్ కానిస్టేబుళ్ల నుంచి, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.1500 వసూలు చేసినట్లు సమాచారం. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఈ వసూళ్లకు పాల్పడినట్లు సెక్యూరిటీ గార్డులు ఆరోపిస్తున్నారు.