WGL: క్రిస్మస్ వేడుకలను వరంగల్ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. మూడు నియోజకవర్గాలకు రూ.2 లక్షల చొప్పున నిధులతో ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.