ADB: నేరడిగొండలోని పలు గ్రామపంచాయతీల సర్పంచులు బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్‌ను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా గెలిచిన సర్పంచులు సమిష్టిగా పనిచేసి గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని ఆడే గజేందర్ సూచించారు.