MBNR: విదేశాల్లో నివసించే వారు స్వదేశంపై ఎక్కువ మమకారం పెంచుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని లిటిల్ రోజ్ పాఠశాలలో వైకల్యం ఉన్నవారికి మూడు చక్రాల సైకిళ్లు, కృత్రిమ పాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సేవా భావంతో ముందుకు వచ్చే వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు.