KMR: భిక్కనూరు మండలం ఈసనపల్లికి చెందిన మాదిగలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్ అన్నారు. ఇటీవల గ్రామస్థులు మాదిగలను గ్రామ బహిష్కరణ చేయడం పట్ల వారు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అన్ని కులాలు ఒకటేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.