TG: పబ్లిక్ సర్వీస్ కమిషన్లు దేశ పాలనా వ్యవస్థకు వెన్నెముకలు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYDలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల ముగింపు సదస్సులో పాల్గొన్న భట్టి.. పరీక్షల నిర్వహణలో వార్షిక క్యాలెండర్ తప్పనిసరి అని తెలిపారు. TGPSC విజయవంతంగా జాబ్ క్యాలెండర్ నిర్వహిస్తోందని ఉద్ఘాటించారు. పారదర్శకతే పబ్లిక్ సర్వీస్ కమిషన్కు ప్రాణం అని అన్నారు.