TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలోని 2వ గేటు వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన క్యూలైన్లను ఆలయ ఈవో బాపిరెడ్డి శనివారం తనిఖీ చేశారు. భక్తుల సౌకర్యార్థం అన్ని సేవలు కౌంటర్లు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈవో తెలిపారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని వివిధ కౌంటర్లను పరిశీలించారు.