W.G: గొల్లలకోడేరులోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిబ్బందితో కలిసి కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి నెల మూడో శనివారం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.