CTR: పుంగనూరు నియోజకవర్గంలో ఆదివారం వైసీపీ ఆధ్వర్యంలో రచ్చబండ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని గ్రామాలలో కమిటీలు ఏర్పాటు అవ్వడంతో పార్టీ అధిష్టానం మేరకు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల పరిధిలో రచ్చబండ సమావేశాలు నిర్వహించి, ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయాలని ఇప్పటికే అధిష్టానం సూచనలు ఇచ్చింది.