NRPT: నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్ను చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కె. లక్ష్మిపతి గౌడ్ శనివారం సందర్శించారు. బాల్య వివాహాలను పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, బాల కార్మిక వ్యవస్థపై SI రాముడుతో చర్చించారు. స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.