SDPT: జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభకనబరిచిన స్థానిక క్రీడాకారుడు అనస్‌ను ఎమ్మెల్యే హరీశ్ రావు అభినందించారు. శాలువాతో సన్మానించి, క్రీడా కిట్‌ను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట మైదానంలో ఓనమాలు నేర్చుకున్న అనస్, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి పట్టణ ఖ్యాతిని చాటాలని ఆకాంక్షించారు.