VZM: బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో అద్భుత విజయాన్ని అందుకున్న భోగాపురం మండలం, సుందరపేట గ్రామానికి చెందిన కళ్యాణ్ పడాలకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ‘అగ్నిపరీక్ష’ ప్రమోషన్స్ సమయంలో కళ్యాణ్ తనను కలిశారన్నారు. బిగ్ బాస్ విజేతగా నిలిచి నెల్లిమర్ల నియోజకవర్గానికి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా దీవించానన్నారు.