PPM: చీపురుపల్లిలోని పీకేపాలవలసకు చెందిన పి. రాంబాబును కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇళ్లలో చొరబడి బీరువా లాకర్లను పగొలగొట్టకుండా తాళాలు వెతికి మరీ తీసేవాడు. అయితే ఇంట్లో వారికి అనుమానం రాకుండా సగం నగలు మాత్రమే ఎత్తుకెళ్లేవాడు. దీంతో ఇంట్లో వారే తగువుపడేవారు. వాటిని మధ్యవర్తులకు కమిషన్ ఇచ్చి తాకట్టు పెట్టించేవాడని పోలీసులు తెలిపారు.