PDPL: గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజ్ ఆవరణలో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ‘వినికిడి శక్తి – అనుభవజ్ఞులైన వారి సామర్థ్యం’ అనే అంశంపై శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాలేజ్ ఇంఛార్జ్ ప్రిన్సిపల్ నాగమల్ల జనార్ధన్ అధ్యక్షతన సమన్వయకర్త ఆనంద్ పాల్గొని ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.