PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 1వ డివిజన్ మేడిపల్లి రైతు వేదిక ఆవరణలో శనివారం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రకాష్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్ గురించి రైతులకు అవగాహన కల్పించామన్నారు. తద్వారా ఎక్కడ ఎంత స్టాక్ ఉందనే విషయం తెలుస్తుందని, దళారుల ప్రమేయం ఇక ఉండదని పేర్కొన్నారు.