TPT: రేణిగుంట రైల్వేకోడూరు రహదారిలోని ఆంజనేయపురం చెక్ పోస్ట్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు పోలీసులను చూసి కారులో పారిపోవడానికి ప్రయత్నించారు. కారు అదుపుతప్పి లారీని ఢీకొనడంతో అందులోని 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.