ATP: రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుమ్మగట్ట మండల కన్వీనర్ సన్నన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాలువ నివాసంలో 18 వైసీపీ పార్టీకి చెందిన కుటుంబాలు టిడిపిలో చేరారు. ఎమ్మెల్యే కాల్వ వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. పార్టీ మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు.