T20 WCకు ఎంపిక చేసిన జట్టే న్యూజిలాండ్‌తో జరగబోయే T20 సిరీస్‌లోనూ ఆడుతుందని సెలక్టర్లు తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 31 వరకు కివీస్‌తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ జరగనుంది. FEB 7న T20 WC ఆరంభం కానున్న నేపథ్యంలో, ఈ సిరీస్‌ను భారత్ కీలక సన్నాహకంగా భావిస్తోంది. కాగా, న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ నుంచి కోహ్లీకి విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.