KNR: హుజురాబాద్లో కోతులు వీరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో చాకలి వాడకు చెందిన బుడిగే లక్ష్మి అనే మహిళ పై కోతులు దాడి చేయగా ఆమె కాలికి, చేతులకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అంతే కాకుండా రోజు స్కూల్కు వెళ్లే పిల్లలపై కూడా దాడికి పాల్పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.