WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఇవాళ యూరియా యాప్ గురించి రైతులకు తాహసీల్దార్ రవిచంద్ర రెడ్డి అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యూరియా బస్తాల కోసం రైతుల ఇబ్బందులు గమనించి ప్రభుత్వం ప్రత్యేక ఆప్ ను ప్రవేశపెట్టిందన్నారు. ఈ యాప్ ద్వారా రైతులు యూరియా బస్తాలను సులభంగా కోనుగోలు చేసుకోవచ్చాన్నారు.