SRPT: ఎన్టీఆర్ కాలనీలోని NTR పార్కు అధ్వానంగా తయారైంది. ఎటు చూసినా ధ్వంసమైన ఆట, ఓపెన్ జిమ్ వస్తువులు, పిచ్చిమొక్కలే దర్శనమిస్తున్నాయి. పట్టణంలోని NTR పార్క్ తెలంగాణ క్రీడా ప్రాంగణం లక్షలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లో వ్యాయామ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఒకప్పుడు పర్యాటకులతో కళకళలాడే పార్కు ఇప్పుడు కళావిహీనంగా మారింది.