KMR: సదాశివనగర్ మండలం మర్కల్కు చెందిన పరిశోధకుడు వరకాంతం బాల్ రెడ్డి బెంగళూరులో నిర్వహిస్తున్న 76వ అఖిల భారత వాణిజ్య సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో తన పరిశోధనా ప్రతిభను ప్రదర్శించారు. కోవిడ్ 19 అనంతర డిజిటల్ వాణిజ్యంలో సైబర్ భద్రత, డేటా పరిపాలనలో ఎదురయ్యే సవాళ్ల అంశంపై సెమినార్లో పరిశోధనా పత్రాన్ని విజయవంతంగా సమర్పించారు.