CTR: పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపి వారి సిబ్బందితో హెల్మెట్ ధారణపై విన్నూత్నంగా అవగాహన కల్పించారు. ఇందులో బాగంగా పూతలపట్టు లోని నయారా పెట్రోల్ బంక్ నందు హెల్మెట్ లేకుండా పెట్రోల్ కోసం వచ్చే ప్రజలకు ప్లకార్డ్ పట్టి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఇన్స్పెక్టర్ గోపి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలన్నారు.