KDP: వల్లూరు మండలంలో నిర్మిస్తున్న ‘స్మార్ట్ కిచెన్’ భవన పనులను కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యా రెడ్డి ఇవాళ పరిశీలించారు. భవన నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా నిర్మాణంలో ఎక్కడా నాణ్యతా లోపం లేకుండా చూడాలని, క్వాలిటీ విషయంలో రాజీపడవద్దని స్పష్టం చేశారు.