CTR: సంక్షేమ పథకాల అమలులో సాంకేతికతను జోడించడం ద్వారా పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నగరి MLA గాలి భాను ప్రకాష్ స్పష్టం చేశారు. ఇవాళ నగరి ఐసీడీఎస్ కార్యాలయంలో నగరి, నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన 209 మంది అంగన్వాడీ టీచర్లకు ఆధునిక 5జీ స్మార్ట్ ఫోన్లను గౌరవ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పంపిణీ చేశారు.