NDL: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని యధావిథిగా కొనసాగించాలని సీపీఎం పార్టీ డిమాండ్ చేసింది. శనివారం పాముల పాడు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషించిన గాంధీ పేరు తొలగించడం అమానుషం అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.