BDK: జిల్లాలో విపత్తుల నిర్వహణకు ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ ఆదేశించారు. విపత్తుల సమయంలో సమర్థ స్పందన కోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గోదావరి వరదలపై ముందస్తూ సిద్ధతగా ఈ నెల 22న బూర్గంపాడులో మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వేగవంతమైన రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.