KDP: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోని పోలీస్ వెల్ఫేర్ క్యాంటీన్, కల్పతరు స్టోర్స్‌లో నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను వేలం వేయనున్నారు. ఈ నెల 24న తేదీ ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఇందులో ఫ్యాన్లు, ఐరన్ ర్యాక్స్, ఏసీలు, కంప్యూటర్లు, ఐరన్ స్క్రాప్ వంటి పలు వస్తువులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.