BDK: కొత్తగూడెంలో సెంట్రల్ ఫంక్షన్, ఏరియాలలో సింగరేణి డే వేడుకలు పాత పద్ధతిలోనే నిర్వహించాలని లేనిచో బాధ్యతగల గుర్తింపు కార్మిక సంఘంగా కార్మికుల పక్షాన ఈ వేడుకలను బహిష్కరిస్తామని AITUC మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి రామ్ గోపాల్ అన్నారు. సింగరేణి యాజమాన్యం వెంటనే నిధులు విడుదల చేసి పాత పద్ధతిలోనే వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.