NZB: బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ శనివారం తెలిపారు.