TG: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు లాభపడ్డాయని ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ అసహనం వ్యక్తం చేశారు. సమన్వయ లోపం వల్ల గెలవాల్సిన స్థానాల్లో కూడా ఓడిపోయామని మండిపడ్డారు. ఇంకోసారి ఇలా రిపీట్ కావొద్దని నేతలకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.