HYD: నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనంలో ప్రత్యేక ధ్యాన సమావేశాన్ని రేపు నిర్వహించనున్నారు. ఈ వేడుకకు భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఒక ‘ప్రపంచం-ఒక హృదయం’ అనే నినాదంతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.