హైదరాబాద్లోని ఆరాంఘర్ చౌరస్తాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు అధికారులు భారీ ప్లాన్ వేశారు. బెంగళూరు హైవేపై కీలకమైన ఈ జంక్షన్లో పాదచారుల భద్రత కోసం, వాహనాల రాకపోకల కోసం వలయాకార స్కైవాక్ నిర్మించాలని ప్రతిపాదించారు. విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఈ చౌరస్తాలో, ఇకపై పాదచారులు రోడ్డు దాటడానికి ప్రాణాలకు తెగించాల్సిన పనిలేదు.