AP: స్కూల్, జూనియర్ కాలేజీ విద్యార్థులకు పరిశుభ్రత అలవాట్లు నేర్పేందుకు చేపట్టిన ‘ముస్తాబు’ ఓ మంచి కార్యక్రమమని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెం సాంఘీక సంక్షేమ రెసిడెన్షియన్ స్కూల్కు వెళ్లిన ఆయన.. అక్కడి విద్యార్థినులతో మాటామంతీ నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని పిల్లల బంగారు భవిష్యత్ బాధ్యత తనది అని సీఎం స్పష్టంచేశారు.