TG: రేపు జరిగే BRS భేటీలో నదీ జలాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మాజీ మంత్రి KTR తెలిపారు. దీంతో పాటు సభ్యత్వ నమోదు సహా సంస్థాగత అంశాలపై చర్చ ఉంటుందన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరామని బహిరంగంగా చెప్పారని.. సభాపతి మాత్రం ఆధారాలు లేవని విడ్డూరంగా తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యే వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.