ATP: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తాడిపత్రిలో వేడుకలు నిర్వహించనున్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 9 గంటలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరగనుంది. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలిరావాలని పెద్దారెడ్డి పిలుపునిచ్చారు.