MBNR: బాలానగర్ మండలంలో మొత్తం 37 గ్రామపంచాయతీలు ఉండగా, ఈనెల 17న మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పలుగు మీది తాండ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా కుమార్ నాయక్ గెలుపొందారు. 25 ఏళ్ల వయసులోనే సర్పంచిగా ఎన్నిక కావడం ప్రత్యేకతగా నిలిచింది. యువ వయసులో ప్రజాప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కుమార్ నాయక్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందనలు తెలిపారు.