కృష్ణా: డిసెంబర్ 21న పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిణి రాణి సంయుక్త కోరారు. శనివారం కోడూరులో వైద్య సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. PHC పరిధిలో 21 బూత్ల ద్వారా బస్టాండ్, గ్రామపంచాయతీ తదితర ప్రాంతాలలో పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.