MNCL: బెల్లంపల్లి మండలం శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయ పరిసరాలలో పులి సంచారం భక్తులకు భయాందోళన కలిగిస్తుంది. దేవాలయం పరిసరాల్లో శనివారం పెద్దపులిని చూసిన సానికులు ఆటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలను నిర్ధారించారు. పులి పాదముద్రల ఆధారంగా అది అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లుగా గుర్తించారు.