MDK: రైతులకు డీలర్లు తప్పనిసరిగా యూరియా బుకింగ్ యాప్ ద్వారానే ఫర్టిలైజర్ విక్రయించాలని నర్సాపూర్ వ్యవసాయ సహాయ సంచాలకులు సంధ్యారాణి సూచించారు. మండల పరిధిలోని పలు ఎరువుల దుకాణ యజమానులకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. రైతులు తమ కావాల్సిన ఫర్టిలైజర్ను యూరియా బుకింగ్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు.