NGKL: బతుకుదెరువు కోసం పొరుగు ఊరు వచ్చి కూలి పనులు చేసుకుంటున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. తల్లి, చిన్నారి కుమార్తె అదృశ్యం కావడంతో భర్త కురుమయ్య కన్నీరుమున్నీరయాడు. నల్లవెల్లికి చెందిన ఈ కుటుంబం ఓ యజమాని పొలంలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. భార్య స్వప్న, కూతురు మైథిలి అదృశ్యం కావడంతో బాధితుడి ఫిర్యాదుతో ఊర్కొండ ఎస్సై కృష్ణదేవ కేసు నమోదు చేశారు.