ATP: జిల్లాలో బైపాస్ రోడ్డులోని కక్కలపల్లి క్రాస్ వద్ద ఉన్న “ఆర్” కన్వెన్షన్‌లో ‘ది మిర్రర్ అఫైర్’ ఎగ్జిబిషన్‌ను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ ప్రారంభించారు. రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రదర్శనలోని వివిధ స్టాళ్లను ఆమె నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.